Narendra Modi: చంద్రబాబుతో మోదీ ఆసక్తికర సంభాషణ.. మోదీ మాట్లాడుతుండగా పలుమార్లు మూగబోయిన మైక్

MIC cut during Modi speech
  • మీ వాయిస్ గట్టిగా ఉందని చంద్రబాబుకు చెప్పిన మోదీ
  • మోదీ ప్రసంగిస్తుండగా రెండు సార్లు కట్ అయిన మైక్
  • జనాలు ముందుకు నెట్టుకు రావడంతో సమస్య
చిలకలూరిపేట (బొప్పూడి)లో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతం అయింది. సభ కొనసాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించి తిరిగి తన సీట్ వద్దకు వచ్చిన తర్వాత... మీ వాయిస్ చాలా గట్టిగా ఉందని, మీరు చాలా స్ట్రాంగ్ అంటూ మోదీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

మరోవైపు, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ కట్ అయింది. జనం భారీగా ముందుకు నెట్టుకు రావడంతో సమస్య తలెత్తింది. ఆడియో కన్సోల్, మైక్ స్టాండ్ లపైకి ప్రజలు ఎక్కారు. ఈ క్రమంలో రెండు సార్లు మైక్ కట్ అయింది. ప్రసంగం మధ్యలో మైక్ కట్ అయినప్పటికీ ప్రధాని ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఇంత మంది ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నారు.

Narendra Modi
BJP
Chandrababu
Telugudesam

More Telugu News