తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
- తెలంగాణలో రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు
- ఐదు నిమిషాల నిబంధన ఎత్తివేత
- ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టికెట్ నంబరు రాయాల్సిందేనని ఆదేశం
కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, ఇప్పటి వరకు అమలులో ఉన్న 5 నిమిషాల నిబంధనను ఎత్తివేసింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది. రేపు ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి.