Anuradha Paudwal: బీజేపీలో చేరిన‌ ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్‌

Famous Bollywood singer Anuradha Paudwal joins BJP
  • అనురాధ పౌద్వాల్‌ బీజేపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుంద‌న్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌
  • బీజేపీలో చేర‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన అనురాధ పౌడ్వాల్‌ 
  • స‌నాత‌న ధ‌ర్మంతో బ‌ల‌మైన‌ అనుబంధం ఉన్న పార్టీలో చేర‌డం త‌న అదృష్టమ‌న్న గాయ‌ని    

ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్‌ శనివారం బీజేపీలో చేరారు. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆమె ఇలా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గ‌మ‌నార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, జాతీయ మీడియా ఇన్‌చార్జి అనిల్‌ బలూని తదితర నేతల సమక్షంలో ఆమె బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

ఈ సంద‌ర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. "అనురాధ పౌడ్వాల్‌ బీజేపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. దేశ విదేశాల్లో భక్తిగీతాల ప్ర‌స్తావ‌న వ‌స్తే మొద‌ట గుర్తుకు వ‌చ్చే పేరు అనురాధ పౌడ్వాల్‌దే. గ‌త 35 ఏళ్లుగా ఆమె భక్తిగీతాలు పాడుతున్నారు. ఇక ప్రధాని మోదీ నాయ‌క‌త్వంలో దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆకర్షితురాలైన‌ అనురాధ పౌద్వాల్ బీజేపీలో చేరాల‌ని నిర్ణయించుకున్నారు" అని అరుణ్ సింగ్ అన్నారు. కాగా, బీజేపీలో చేర‌డం ప‌ట్ల అనురాధ పౌడ్వాల్‌ ఆనందం వ్య‌క్తం చేశారు. స‌నాత‌న ధ‌ర్మంతో బ‌ల‌మైన‌ అనుబంధం ఉన్న పార్టీలో చేర‌డం త‌న అదృష్టం అని ఆమె పేర్కొన్నారు.
Anuradha Paudwal
Bollywood
Singer
BJP

More Telugu News