ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు ఎన్నికలు
- లోక్ సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణల్లో మే 13న పోలింగ్
- ఏపీలో లోక్ సభ, శాసనసభ.. టీఎస్ లో లోక్ సభ ఎన్నికలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే... ఒకే రోజున మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీకి పోలింగ్ జరగనుండగా... తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో... దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.