Amitabh Bachchan: ఆసుపత్రిలో అమితాబ్ బచ్చన్.. యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు!

Amitabh Bachchan hospitalised
  • అస్వస్థతతో ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన అమితాబ్
  • కాలిలో క్లాట్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి!
  • అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్న అమితాబ్ 
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ అస్వస్థత కారణంగా ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలిలో రక్తం గడ్డ కట్టిన కారణంగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు! 

ఈ ఉదయం అమితాబ్ ఆసుపత్రిలో చేరినట్టు తెలియగానే, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. అభిమానులు తన కోసం ప్రార్థిస్తున్న విషయం తెలుసుకున్న అమితాబ్ సోషల్ మీడియా వేదికగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 ఏడీ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Amitabh Bachchan
Illness
Mumbai
Bollywood

More Telugu News