K Kavitha: ఈ రోజు రాత్రి ఈడీ కార్యాలయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha will stay in ED office today
  • ఈ రోజు రాత్రి 11.30 గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి చేరుకోనున్న కవిత
  • రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరు పరిచే అవకాశం
  • ఈడీ అధికారులు కవిత కస్టడీని కోరే అవకాశం
మద్యం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఈ రోజు రాత్రి 11.30 గంటల తర్వాత ఆమె ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఆమెను రాత్రి ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. మద్యం కేసులో మరింత విచారణకు ఈడీ అధికారులు ఆమె కస్టడీని కోరనున్నారు. మరోవైపు కవిత తన అరెస్టును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

లాఠీఛార్జ్ మధ్య కవితను తీసుకువెళ్లిన అధికారులు

కవితను హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసివేసి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
K Kavitha
BRS
ed

More Telugu News