K Kavitha: కాసేపట్లో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ.. కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్
  • కేటీఆర్, హరీశ్ లను కూడా ఇంట్లోకి అనుమతించని ఈడీ అధికారులు
  • బీజేపీ, మోదీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
ED to lift Kavitha to Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ ను ఈడీ అధికారులు నిర్ధారించారు. కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటి క్రితం కవిత ఇంటి వద్దకు కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. వీరిని కూడా కవిత ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. కవిత ఇంటి గేటు వెలుపలే వీరు నిలుచున్నారు. 

కవిత నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ డౌన్ డౌన్ అని నినదిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. కవిత నివాసంలో కవిత, ఆమె భర్త, పిల్లలు, పీఏ, సహాయకులు మాత్రమే ఉన్నారు.

More Telugu News