BJP: 411 స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలుపు: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి

  • తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్ సభ స్థానాలకు గాను 25 సీట్లు గెలుచుకోనున్న ఎన్డీయే
  • ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాలకు 77 చోట్ల విజయం వరిస్తుందన్న సర్వే
  • గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని విశ్లేషించిన సర్వే
NDA will cross 400 seats in next lok sabha elections

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కు పైగా లోక్ సభ సీట్లను గెలిచి అద్భుత విజయం సాధించే అవకాశం ఉందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 411 సీట్లు గెలుచుకోవచ్చునని, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 105 సీట్లు గెలుచుకోవచ్చునని, ఇతరులు 27 సీట్లు సాధించవచ్చునని సర్వే విశ్లేషించింది.

స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి 1985లో 426 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీయే 400 మార్కును దాటవచ్చునని ఈ సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతగా 350 సీట్లు గెలుచుకోవచ్చునని.. మిత్రపక్షాలతో కలిసి 61 స్థానాలు గెలుచుకోవచ్చునని తెలిపింది. కాంగ్రెస్ కేవలం 49 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలు 56 సీట్లు గెలుచుకోవచ్చునని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేనకు 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు రావొచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 8, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1 సీటు గెలిచే అవకాశముందని తెలిపింది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, అసోం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశముందని తెలిపింది. తమిళనాడు, కేరళలో తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ మంచి ప్రదర్శన కనబరుస్తుందని సర్వే పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని సర్వే విశ్లేషించింది.

1. బీహార్ (40) - NDA 38, INDIA 2
2. కేరళ (20) - UDF 14, LDF 4, BJP 2
3. మధ్యప్రదేశ్ (29) - BJP 28, INDIA 1
4. తమిళనాడు (39) - INDIA 30, BJP 5, ADMK 4
5. హర్యానా (10) - BJP 10, INDIA 0
6. హిమాచల్ ప్రదేశ్ (4) - BJP 4, INDIA 0
7. పంజాబ్ (13) - AAP 1, INDIA 7, BJP 3, ఇతరులు 2
8. ఢిల్లీ (7) - BJP 7, INDIA 0
9. ఉత్తర ప్రదేశ్ (80) - BJP 77, INDIA 2, ఇతరులు 1
10. తెలంగాణ (17) - BJP 8, INDIA 6, BRS 2, ఇతరులు 1
11. ఆంధ్రప్రదేశ్ (25) - NDA 18, YSRCP 7, INDIA 0
12. కర్ణాటక (28) - BJP 25, INDIA 3
13. అసోం (14) - BJP 12, INDIA 0, ఇతరులు 2
14. రాజస్థాన్ (25) - BJP 25, INDIA 0
15. ఉత్తరాఖండ్ (5) - BJP 5, INDIA 0
16. ఒడిశా (21) - BJP 13, BJD 8, INDIA 1
17. చత్తీస్‌గఢ్ (11) - BJP 10, INDIA 1
18. ఝార్ఖండ్ (14) - BJP 12, INDIA 2
19. పశ్చిమ బెంగాల్ (42) - NDA 25, TMC 17, Congress 0
20. గుజరాత్ (26) - BJP 26, INDIA 0
21. మహారాష్ట్ర (48) - NDA 41, INDIA 7
22. ఈశాన్య రాష్ట్రాలు, ఇతర సీట్లు (25) - NDA 17, INDIA 8

More Telugu News