మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
- మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించిన కేసీఆర్
- ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి ఆత్రం సక్కును ఖరారు చేసిన అధినేత
- 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన నగేశ్ ఈసారి బీజేపీ నుంచి పోటీ
2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నుంచి నగేశ్ పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి టిక్కెట్ ఆత్రం సక్కుకు ఇస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నగేశ్ బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో ఆత్రం సక్కుకు మార్గం మరింత క్లియర్ అయింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.