BRS: మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

KCR announces another two mp candidates
  • మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించిన కేసీఆర్
  • ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి ఆత్రం సక్కును ఖరారు చేసిన అధినేత
  • 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన నగేశ్ ఈసారి బీజేపీ నుంచి పోటీ
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి ఆత్రం సక్కును ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ వీరిద్దరి పేర్లను ప్రకటించారు. ఉదయం ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం ముఖ్య నేతలతో అధినేత సమావేశమయ్యారు. ఈ సాయంకాలం అభ్యర్థిని ప్రకటించారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నుంచి నగేశ్ పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి టిక్కెట్ ఆత్రం సక్కుకు ఇస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నగేశ్ బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో ఆత్రం సక్కుకు మార్గం మరింత క్లియర్ అయింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
BRS
KCR
Lok Sabha Polls

More Telugu News