జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందన
- జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేసిన విశ్వేశ్వర్ రెడ్డి
- ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ సీట్లను తాము గెలిచినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్య
- 12కు పైగా లోక్ సభ సీట్లు గెలుస్తామన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమనేది కేవలం వట్టి ప్రచారమేనని వ్యాఖ్యానించారు. ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా లేరని, చేవెళ్లలో ముస్లింలు అందరూ బీజేపీకే వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వచ్చేసరికి బీజేపీ తొలి విడత ప్రచారం పూర్తి చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేది కేవలం ప్రచారమేనని తెలిపారు.
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. చేవెళ్ల పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని కీలక నేతలు బీజేపీలో చేరనున్నారని తెలిపారు. దేశ ప్రజలు ప్రధాని మోదీనే నమ్ముతున్నట్లు చెప్పారు. ఏ వర్గాన్ని బీజేపీ.. ఓటు బ్యాంక్‌గా చూడటం లేదన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు తీసుకురావటానికి కృషి చేస్తానని తెలిపారు.