Telugudesam: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 18 సీట్లు, 15 సీట్లు నష్టపోనున్న వైసీపీ: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి

  • 2019లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ
  • కూటమి కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీలకు సీట్లు భారీగా పెరుగుతాయన్న సర్వే
  • వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించిన సర్వే
TDP and Janasena alliance may win 18 lok sabha seats in parliament elections

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 18 సీట్లు వచ్చే అవకాశముందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. అధికార వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని ఈ సర్వే విశ్లేషించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లలో గెలవగా, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్డీయే కూటమి 15 సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీయేకు కలిసి వచ్చిందని ఈ సర్వే పేర్కొంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ రాకపోవచ్చునని పేర్కొంది.

టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం ఓటు బ్యాంకు సాధించి 18 సీట్లు, వైసీపీ 41 శాతం ఓటు బ్యాంకుతో 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. ఇండియా కూటమికి 6 శాతం, ఇతరులకు 3 శాతం రావొచ్చునని పేర్కొంది. ఇక్కడ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు.

More Telugu News