శ్రీలంకలో 21 మంది భారతీయ యువకుల అరెస్ట్.. పర్యాటక వీసాపై వెళ్లి వీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
- నిందితులందరూ 25 ఏళ్లలోపువారే
- గత నెల శ్రీలంకలో కాలుమోపిన యువకులు
- నెగోంబోలో అద్దె భవనం తీసుకుని కంప్యూటర్ ఆపరేటెడ్ బిజినెస్
- గత నెలలో శ్రీలంకను సందర్శించిన 30 వేల మంది భారతీయులు
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 31 వరకు వీసా లేకుండానే భారత సహా మరికొన్ని దేశాల పర్యాటకులను అనుమతిస్తోంది. పట్టుబడిన నిందితులు ఫిబ్రవరి, మార్చిలో టూరిస్ట్ వీసాలపై శ్రీలంకలో కాలుమోపారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ టూరిస్టులు కూడా శ్రీలంకలో వ్యాపారాలు చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 30 వేలమందికిపైగా భారతీయులు శ్రీలంకను సందర్శిస్తే.. 32 వేల మంది రష్యా పర్యాటకులు శ్రీలంకలో వాలిపోయారు.