Vijayasai Reddy: మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బీజేపీతో జతకట్టారు: విజయసాయిరెడ్డి

Chandrababu has sacrificed Special Category Status says Vijaysai Reddy
  • స్వలాభం కోసం బీజేపీతో చేతులు కలిపారన్న విజయసాయి
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతించారని విమర్శ
  • రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి విజయసాయి పోటీ
మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతించారని, సామాజిక - ఆర్థిక కులగణనను ఆపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మళ్లీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ వైపు వెళ్తారని చెప్పారు. మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయబోతున్నారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
BJP

More Telugu News