Manchu Manoj: ఆ వార్తలను మాత్రం నమ్మకండి.. ఆ విషయాన్ని మేమే చెబుతాం: మంచు మనోజ్

Manchu Manoj wife Mounika pregnant
  • తన భార్య ఏడో నెల గర్భవతి అని వెల్లడించిన మనోజ్
  • ఇప్పటి వరకు చాలా ఆరోగ్యంగా ఉందని వెల్లడి
  • తమ జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఆశగా ఎదురు చూస్తున్నామన్న మనోజ్

సినీ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రస్తుతం గర్భవతి, త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నారు. మౌనిక బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా మంచు మనోజ్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇంతటి గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. 

నా భార్య ప్రస్తుతం ఏడో నెల గర్భవతి. భగవంతుడి దీవెనలతో ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కవల పిల్లల విషయంలో బయట వస్తున్న వార్తలలో నిజం లేదు. మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు. ఎల్లప్పుడు మీరు మాపై చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామ రక్ష' అని ట్వీట్ చేశారు. 

మనోజ్ భార్య మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య ఏడో నెల గర్భవతి అని, డెలివరీ అయిన తర్వాత తామే ఆ విషయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News