Aadhaar: ఆధార్ అప్ డేట్ గడువు మళ్లీ పొడిగించారు!

  • ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న కేంద్రం
  • గతంలో పలుమార్లు గడువు పొడిగింపు
  • మార్చి 14తో ముగియనున్న పాత గడువు
  • తాజాగా జూన్ 14 వరకు గడువు పొడిగింపు
Aadhaar update timeline extended till June 14

ఆధార్ అప్ డేట్ గడువును మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించిన మేరకు ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువు మార్చి 14తో ముగియనుంది. ఇప్పుడీ గడువును జూన్ 14 వరకు పొడిగించారు. ఈ మూడు నెలల్లో ఆధార్ ను అప్ డేట్ చేసుకునే వారు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. 

ఇప్పటికే ఆధార్ ఫ్రీ అప్ డేట్ పై కేంద్రం పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. దేశంలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడం, అప్ డేట్ చేసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా, ఆధార్ తీసుకుని పదేళ్లయిన వారు తమ డెమోగ్రాఫిక్ వివరాలు నవీకరించాల్సి ఉంటుంది. UIDAI వెబ్ సైట్ లో తగిన గుర్తింపు కార్డుతో తమ వివరాలను అప్ డేట్ చేసుకోవాలి. 

ఐడెంటిటీ, అడ్రస్ అప్ డేట్ కోసం ఓటర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, కిసాన్ పాస్ బుక్, రేషన్ కార్డు సమర్పించవచ్చని UIDAI  వెల్లడించింది. 

కేవలం చిరునామా అప్ డేట్ చేసుకోవాలనుకుంటే... మూడు నెలల్లోపు కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు రసీదులు సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.

More Telugu News