Mallu Bhatti Vikramarka: యాదాద్రి ఆలయ ఘటనపై భట్టి విక్రమార్క స్పందన

  • యాదాద్రిలో చిన్న పీటపై కూర్చున్న భట్టి
  • దళిత నేతను అవమానించారంటూ విమర్శలు
  • కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానన్న భట్టివిక్రమార్క 
Mallu Bhatti response on Yadadri incident

నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీఎస్పీలు విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి. 

ఈ నేపథ్యంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ యాదాద్రిలో జరిగిన ఘటనపై అర్థంపర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని... కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నానని చెప్పారు. బంజారాహిల్స్ లో జరిగిన సింగరేణి గెస్ట్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News