Suryakiran: చిరంజీవి చిన్నప్పటి పాత్రల్లో మెప్పించిన సూర్యకిరణ్!

  • బాలనటుడిగా అనేక చిత్రాలు చేసిన సూర్యకిరణ్
  • ఆ వైపు నుంచి పలకరించిన అవార్డులు 
  • రచయితగాను మంచి గుర్తింపు 
  • 'సత్యం' సినిమాతో దర్శకుడిగా లభించిన తొలి హిట్

Suryakiran Special

టాలీవుడ్ లో ఇప్పుడు చాలామంది దర్శకులు .. తమ సినిమా కథలను తామే సొంతంగా తయారు చేసుకుంటున్నారు. అలాంటి ఒక ప్రయత్నాన్ని చాలా కాలం క్రితమే చేసిన దర్శకుడు సూర్యకిరణ్. రచయితగా .. దర్శకుడిగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 'సత్యం' సినిమాతో దర్శకుడిగా తన గురించి అంతా మాట్లాడుకునేలా చేశాడు. 

సూర్యకిరణ్ ఎవరో కాదు .. 'పసివాడి ప్రాణం' సినిమాలో నటించిన బేబీ సుజితకి అన్నయ్య. అయితే తాను కూడా బాలనటుడిగా చాలా చిత్రాలలో నటించాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తి .. అనిల్ కపూర్, కోలీవుడ్ లో రజనీకాంత్ .. కమల్ హాసన్ లకు చిన్నప్పటి పాత్రలను పోషించి మెప్పించాడు. 

అలాగే తెలుగులో చిరంజీవి నటించిన చాలా సినిమాలలో, ఆయన చిన్నప్పటి పాత్రను పోషించింది సూర్యకిరణ్. ఆ జాబితాలో మనకి రాక్షసుడు .. మగధీరుడు .. స్వయంకృషి .. కొండవీటి దొంగ .. దొంగమొగుడు .. ఖైదీ నెంబర్ 786 .. ఇలా చాలా చిత్రాలు కనిపిస్తాయి. బాలనటుడిగా రెండు జాతీయ అవార్డులను .. రెండు స్టేట్ అవార్డులను అందుకున్నాడు. అలాంటి సూర్యకిరణ్ హఠాన్మరణం పట్ల టాలీవుడ్ సానుభూతిని వ్యక్తం చేస్తోంది. 

More Telugu News