CM Ramesh: లోక్ సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా: సీఎం రమేశ్

CM Ramesh says he will contest in Visakha if BJP top brass agree
  • విశాఖ ఎంపీ స్థానానికి బీజేపీ నేతల మధ్య పోటీ
  • ఇప్పటికే విశాఖ పార్లమెంటు బరిలో క్రియాశీలకంగా ఉన్న జీవీఎల్
  • తాను కూడా హైకమాండ్ కు విశాఖ స్థానంపై ప్రతిపాదన పంపానన్న సీఎం రమేశ్ 
లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో విశాఖ ఎంపీ స్థానానికి మాంచి గిరాకీ ఉన్నట్టే అనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో క్రియాశీలకంగా ఉండగా, ఇప్పుడదే స్థానంపై బీజేపీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 

తాను విశాఖ నుంచి లోక్ సభ బరిలో దిగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే తన మనసులో మాటను పార్టీ హైకమాండ్ కు తెలియజేశానని, అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావిస్తానని వెల్లడించారు. 

ఒకవేళ విశాఖ కాకున్నా, ఇతర ప్రాంతాల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమని సీఎం రమేశ్ వివరించారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు.
CM Ramesh
Visakhapatnam
Lok Sabha Polls
BJP
Andhra Pradesh

More Telugu News