Magunta Sreenivasulu Reddy: ఈ విషయం గురించి చంద్రబాబుకు చెప్పాను: మాగుంట శ్రీనివాసులు రెడ్డి

I am taking rest from politics says Magunta Sreenivasulu Reddy
  • టీడీపీ నేతలకు అల్పాహార విందు ఇచ్చిన మాగుంట
  • రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడి
  • తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడన్న మాగుంట
టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలులోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. దామచర్ల జనార్దన్, అశోక్ రెడ్డి, బీఎన్ విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీ ఎరిక్సన్ బాబు, దర్శి ఇన్ఛార్జీ రవికుమార్ విందు సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి త్వరలోనే టీడీపీలో చేరుతానని చెప్పారు. టీడీపీలో చేరే తేదీని చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. రాజకీయాల నుంచి తాను విశ్రాంతి తీసుకోబోతున్నానని... ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున తన కుమారుడు పోటీ చేస్తాడని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనుండటం శుభ పరిణామమని అన్నారు. మూడు పార్టీల కూటమి సక్సెస్ అవుతుందని చెప్పారు. మరోవైపు ఇటీవలే వైసీపీకి మాగుంట రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Magunta Sreenivasulu Reddy
Telugudesam
AP Politics

More Telugu News