Pawan Kalyan: చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Chandrababu residence in Undavalli
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో బీజేపీ నేతలు షెకావత్, బైజయంత్ పండా సమావేశమయ్యారు. తాజాగా ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరెక్కడ పోటీ చేసేదీ నేడు గానీ, రేపు గానీ ప్రకటించే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu
Janasena
TDP
BJP

More Telugu News