Adult Star Sophia Leone: అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు.. 26 ఏళ్ల వయసులో నటి సోఫియా లియోన్ ఆత్మహత్య

Adult film star Sophia Leone has died at 26
  • ఈ నెల 1న తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించిన సోఫియా
  • తాజాగా వెల్లడించిన ఆమె సవతి తండ్రి
  • స్మారకం కోసం ‘గో ఫండ్ మీ’లో నిధుల సేకరణ
  • అశ్లీల చిత్ర పరిశ్రమలో సోఫియాది నాలుగో ఆత్మహత్య
  • అది ఆత్మహత్య కాదన్న ఆమె మోడల్ ఏజెన్సీ
  • కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు

అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో నటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశ్లీల చిత్రాల నటి సోఫియా లియోన్ అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించారు. ఆమె వయసు 26 సంవత్సరాలు. ఈ నెల మొదట్లోనే ఈ ఘటన జరగ్గా తాజాగా ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. ఈ నెల 1న అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో ‘ప్రతిస్పందించని స్థితి’లో కనిపించినట్టు ఆయన పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ సైట్  ‘గోఫండ్‌మీ’లో ఆయనీ విషయాన్ని వెల్లడిస్తూ సోఫియా స్మారకం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున భారమైన హృదయంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు.  

సోఫియా ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిపారు. ఆమె మరణంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మరణానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వివరించారు. 

సోఫియా మరణవార్తలను ఆమె మోడలింగ్ ఏజెన్సీ ‘101 మోడలింగ్’ కూడా ధ్రువీకరించింది. సోఫియా లియోన్ అకాల మరణం విషాదం నింపిందని, వార్త విని తమ హృదయాలు బద్దలయ్యాయని పేర్కొంది. ఆమెను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, ‘గృహ నిర్బంధ నరహత్య’ అని అభివర్ణించింది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది. 

18 ఏళ్ల వయసులోనే సోఫియా అడల్ట్ ఇండస్ట్రీలో ప్రవేశించింది. ఆమె నికర ఆస్తివిలువ మిలియన్ డాలర్లు. కాగా, అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో అకాల మరణం. ఇంతకుముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ మృతి చెందారు.

  • Loading...

More Telugu News