టూరిస్టుల వాహనం వెంటపడి తరిమిన రైనో.. అస్సాం నేషనల్ పార్క్ లో ఘటన.. వీడియో ఇదిగో!
- ఒకటిన్నర కిలోమీటర్లు తరిమిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ఎప్పుడు జరిగిందనే విషయంపై కొరవడిన స్పష్టత
జీప్ లో వెళుతుండగా రైనో కనిపించడంతో పర్యాటకులు ఫొటోలు దిగుతూ గోల చేశారు. ప్రశాంతంగా గడ్డి తింటుంటే వీళ్ల గోల ఏంటని అనుకుందో ఏమో కానీ ఒక్కసారిగా జీప్ వైపు పరిగెత్తుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. జీపును ముందుకు కదిలించాడు. బెదిరించి వదిలిపెట్టకుండా ఖడ్గమృగం వెంటపడింది. జీప్ వెనకాలే పరిగెత్తుతూ వచ్చింది. ఎంతదూరమైనా ఇలాగే వెంటపడేలా ఉందని భావించిన డ్రైవర్.. వేగం పెంచడంతో కాసేపటికి రైనో ఆగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.