రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- మార్చి 12 నుంచి 22 వరకు రైళ్ల రాకపోకలలో మార్పు
- కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ల దారి మళ్లింపు
- డోన్, గుత్తి స్టేషన్లలో స్టాప్ లు తాత్కాలికంగా రద్దు
ఈ నెల 20న హౌరా- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా నడిపిస్తున్నట్లు చెప్పారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22న శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా, పూరి - యశ్వంత్పూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.