Election Commission: ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్... అలర్ట్ చేసిన ఈసీ

  • లోక్ సభ షెడ్యూల్ అంటూ వాట్సాప్‌లో చక్కర్లు
  • ఇలాంటి ఫేక్ సందేశాలు పంపించే ముందు ధ్రువీకరించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన
  • లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించే సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ
No dates announced fake message shared on WhatsApp

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. ఈ ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాము ఇప్పటి వరకు ఏ తేదీలనూ ప్రకటించలేదని, వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతోన్న షెడ్యూల్ మెసేజ్ నకిలీది అని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ సందేశాలను ఇతరులకు పంపించే ముందు ధ్రువీకరించుకోవాలని సూచించింది.

కాగా, మార్చి 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరుతో ఓ షెడ్యూల్ షేర్ అవుతోంది. మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30న ప్రభుత్వ ఏర్పాటు అని ఆ ఫేక్ షెడ్యూల్‌లో ఉంది. అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికలను ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

More Telugu News