BJP: బీజేపీతో పొత్తు కోసం టీడీపీ-జనసేన చర్చలు జరుపుతున్న వేళ విజయసాయి రెడ్డి కామెంట్స్

  • టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికే తేడా ఏంటన్న వైసీపీ కీలక నేత
  • 2014-19 మధ్య కాలంలో ఏపీలో మోసాలు, అబద్ధాలను ఏపీ చవిచూసిందని వ్యాఖ్య
  • సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరిన విజయసాయి రెడ్డి
Even if BJP joins the TDP Jana Sena alliance how will it be any different says Vijayasai Reddy

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ-జనసేన అధినేతలు ప్రత్యక్షంగా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలుపరచని వాగ్దానాలను ఏపీ చవిచూసిందని అన్నారు. కొత్త ప్యాకేజీలో వస్తున్న పాత ఉత్పత్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 కాళ్ల కుర్చీ నిలబడదని, సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

More Telugu News