VV Lakshminarayana: అమిత్ షా నుంచి చంద్రబాబు లిఖితపూర్వక హామీ తీసుకోవాలి: లక్ష్మీనారాయణ

VV Lakshminarayana demands Chandrababu should take written assurance from Amit Shah
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా స్పందించారు. బీజేపీతో పొత్తు ఖరారు చేసుకోవడానికి ముందే చంద్రబాబు కొన్ని అంశాలపై అమిత్ షా నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవాలని సూచించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న హామీల అమలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరణ, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ అంశాలపై చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమిత్ షా నుంచి హామీ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ లిఖితపూర్వక హామీని ఏపీ ప్రజలకు చూపించాలని తెలిపారు.
Go Back to Shorts
VV Lakshminarayana
Chandrababu
Amit Shah
AP Special Status
Vizag Steel Plant
Visakha Railway Zone

More Telugu News