Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • రోజంతా ఒడిదుడుకులకు గురైన సూచీలు
  • 33 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 19 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో మార్కెట్లు ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రోజంతా ఒడిదుడుకులకు గురయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 74,245 పాయింట్లను టచ్ చేసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 74,119కు చేరుకుంది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 22,494 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.90%), టాటా మోటార్స్ (2.14%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.00%), బజాజ్ ఫైనాన్స్ (1.71%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.68%), రిలయన్స్ (-1.59%), యాక్సిస్ బ్యాంక్ (-1.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.82%), మారుతి (-0.64%).

More Telugu News