KL Rahul: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

  • అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా  రికార్డు సాధించిన లక్నో కెప్టెన్
  • 94 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని సాధించిన రాహుల్
  • ఆదివారం రాత్రి రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో రికార్డు సాధించిన స్టార్ ఆటగాడు
KL Rahul created an all time record in IPL 2024

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిని చవిచూసినప్పటికీ ఆ జట్టు 196 పరుగుల భారీ స్కోరు సాధించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 48 బంతుల్లో 76 పరుగులు బాదాడు. ఇందులో 2 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద ఐపీఎల్‌లో ఆల్-టైమ్ రికార్డును కేఎల్ రాహుల్ సృష్టించాడు.

ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. 32 ఏళ్ల రాహుల్ 94 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో పలువురు ఓపెనర్లు 4000 పరుగులు సాధించినప్పటికీ రాహుల్ కంటే వేగంగా సాధించలేకపోయారు.

ఓపెనర్‌గా ఐపీఎల్‌లో 4000లకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు..
1. శిఖర్ ధావన్ - 6362
2. డేవిడ్ వార్నర్  - 5909 
3. క్రిస్ గేల్ - 4480
4. విరాట్ కోహ్లీ - 4041 
5. కేఎల్ రాహుల్ - 4010.

More Telugu News