Atchannaidu: బస్సులు ఇవ్వకుంటే చిక్కుల్లో పడతారు.. ఆర్టీసీ ఎండీకి అచ్చెన్న హెచ్చరిక

  • 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన బహిరంగ సభ
  • అదే సభలో ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకం విడుదల
  • టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని అచ్చెన్న మండిపాటు
  • 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడి
AP TDP Chief Atchannaidu Warns APS RTC MD For Not Giving Buses To Chilakaluripeta Meeting

ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించనున్న టీడీపీ-జనసేన బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుంటే ప్రస్తుతం ఉన్న అధికారులు ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం ఆర్టీసీ ఎండీని పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు హెచ్చరించారు. గతంలో ఎప్పుడూ అధికారులు ఇలా వ్యవహరించలేదని, ఏ పార్టీ సభలు పెట్టుకున్నా బస్సులు ఇచ్చేవారని తెలిపారు. ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సభలో ‘సూపర్ సిక్స్’, ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. 

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే టీడీపీ, జనసేన దగ్గరైనట్టు చెప్పారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇరు పార్టీల మధ్య గొడవలు పెట్టాలని చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ సభతో చరిత్ర సృష్టించబోతున్నామని, 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే వెంటనే  73062 99999కు ఫోన్ చేస్తే టీడీపీ వెంటనే స్పందిస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

More Telugu News