Namrata Shirodkar: శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మహేశ్‌బాబు భార్య నమ్రత

Mahesh Babu Wife Namrata Shirodkar Visits Shankarpally MRO Office
  • గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేసిన నమ్రత
  • రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయానికి
  • గుర్తుపట్టి సందడి చేసిన మహేశ్ ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్  రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం నిన్న శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేశ్ అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావుడి కనిపించింది. నమ్రత ఏమాత్రం విసుగు చెందకుండా అందరితో ఫొటోలు దిగారు.
Namrata Shirodkar
Mahesh Babu
Tollywood
Shankarpally

More Telugu News