నేడు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ, జనసేన అధినేతలు
- బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ భేటీ
- పొత్తుపై చర్చించే అవకాశం
- ఇదివరకే అమిత్ షాతో కీలక చర్చలు జరిపిన చంద్రబాబు
- నేటి భేటీతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం
మరోవైపు ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి రెండవ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ బుధవారం కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ చర్చించారు. అభ్యర్థుల రెండో జాబితా నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై దాదాపు గంటన్నరపాటు ఇరువురు చర్చించినట్టు సమాచారం.