తమన్ చేతుల మీదుగా 'ఆ ఒక్కటీ అడక్కు' సాంగ్ రిలీజ్
- అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు'
- ఆయన జోడీగా అలరించనున్న ఫరియా అబ్దుల్లా
- సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్
- ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల
అయితే ఆ కథకీ ... ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ హీరోగా నటించాడు. ఆయన సరసన నాయికగా ఫరియా అబ్దుల్లా సందడి చేయనుంది. రాజీవ్ నిర్మించిన ఈ సినిమాకి, మల్లి దర్శకత్వం వహించాడు. వెన్నెల కిశోర్ .. వైవా హర్ష ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తమన్ చేతుల మీదుగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఓయమ్మా కొంచెం ఆగవే .. మనసు చెప్పే మాటను పూర్తిగా వినవే .. నీ బొమ్మ మదిలో ఉన్నదిలే' అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ స్వరపరిచిన ఈ బాణీకి భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.