Raja Singh: ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అనడం పట్ల రాజాసింగ్ స్పందన

Raja Singh responds on CM Revanth Reddy calling PM Modi as big brother
  • ప్రధానిని పెద్దన్న అని సంబోధించడం శుభపరిణామమన్న రాజాసింగ్
  • రేవంత్ రెడ్డి కేసీఆర్‌లా వ్యవహరించవద్దని విజ్ఞప్తి
  • కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం శుభపరిణామమని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌లా వ్యవహరించవద్దని సూచించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయిన మొదట్లో ప్రధానమంత్రి మోదీని పొగడ్తలతో ముంచెత్తారని.. ఆ తర్వాత కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మార్గంలో నడువవద్దని కోరారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ రెడ్డి తెలియజేయాలన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
Raja Singh
Revanth Reddy
Narendra Modi
Telangana
BJP

More Telugu News