ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత
- ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ
- ఖమ్మం నుంచి నామాకు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు అవకాశం
- 2019లో లక్షన్నర మెజార్టీతో విజయం సాధించిన నామా నాగేశ్వర రావు, కవిత
- కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్
సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో ఖమ్మం, మహబూబాబాద్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగులకు మరోసారి అవకాశం కల్పించారు. 2019లో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు 1 లక్ష 67వేల మెజార్టీతో, మహబూబాబాద్ నుంచి కవిత 1 లక్ష 46వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.