Revanth Reddy: సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారు

  • ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
  • వేములవాడ రాజన్న ఆలయ సందర్శన 
CM Revanth Reddy will tour in Sircilla and Vemulavada on Mar 7

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సీఎం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం పర్యటన వివరాలు...

  • సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రారంభోత్సవం
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ
  • వేములవాడ రాజన్న ఆలయ సందర్శన
  • మహా శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
  • గుడి చెరువు మైదానంలో బహిరంగ సభకు హాజరు

More Telugu News