Yuzvendra Chahal: చాహల్ ను భుజంపైకి ఎత్తుకుని గిరగిరా తిప్పిన ఫొగట్.. వీడియో ఇదిగో!

  • కళ్లు తిరుగుతున్నాయంటూ క్రికెటర్ కేకలు
  • ఝలక్ దిఖ్ లాజా వ్రాప్ అప్ పార్టీలో సరదా సన్నివేశం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Wrestler Sangeeta Phogat Lifts Yuzvendra Chahal And Spins Him Around

క్రికెటర్ యుజువేంద్ర చాహల్, రెజ్లర్ సంగీతా ఫొగట్ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా సన్నివేశం వారి అభిమానులతో పాటు మిగతా వారినీ నవ్విస్తోంది. ఓ పార్టీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బక్క పలచగా ఉండే చాహల్ ను ఫొగట్ ఉప్పు మూటలా పైకెత్తి తన భుజాలపైన వేసుకుంది. ఆపై డ్యాన్స్ ఫ్లోర్ లో గిరగిరా తిరగడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఓవైపు కళ్లు తిరుగుతుంటే, మరోవైపు ఎక్కడ పడిపోతానో అని చాహల్ కేకలు పెట్టడంతో అక్కడున్న వారంతా నవ్వాపుకోలేకపోయారు.

కొన్ని క్షణాల తర్వాత చాహల్ ను ఫొగట్ కిందికి దింపేసింది. ఈ సరదా సన్నివేశం శుక్రవారం ‘ఝలక్ దిఖ్ లాజా’ వ్రాప్ అప్ పార్టీలో చోటుచేసుకుంది. ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో ఫైనల్ కు చేరుకున్న ఐదుగురిలో చాహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తన భార్యకు ఓటు వేసి గెలిపించాలంటూ చాహల్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

View this post on Instagram

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

More Telugu News