Cabinet Meeting: కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

  • లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం
  • మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ
  • ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం
narendra modi last cabinet meeting

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో చివరిసారిగా కేంద్ర మంత్రివర్గం మరి కాసేపట్లో సమావేశం కానుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధాని తన మంత్రివర్గ సహచరులకు వీడ్కోలు పార్టీ  ఇవ్వనున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమేటిక్ ఎన్‌క్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. కాగా, ఈ సమావేశంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై కూడా ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News