YS Jagan: ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారం సీఎం జగన్ పర్యటన

CM Jagans Visakhapatnam District Tour Scheduled for March 5th and 7th
  • ఈ నెల 5న వైజాగ్‌లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
  • విశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిపై, భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్
  • నగర అభివృద్ధి కోసం నిపుణుల, పారిశ్రామికవేత్తల నుంచి సలహాల సేకరణ
  • ఈ నెల 7న అనకాపల్లిలో ‘చేయూత ’ సభలో పాల్గొననున్న సీఎం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5-7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఐదేళ్లల్లో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందిందీ, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతోందీ చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతను తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తరువాత అనకాపల్లిలో జరిగే ‘చేయూత’ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

సీఎం రెండు రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో చెప్పాలనే ఉద్దేశంతో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
YS Jagan
Vizag
Andhra Pradesh
YSRCP
Gudivada Amarnath

More Telugu News