Shreyas IyerShreyas Iyer: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కీలక నిర్ణయం!

Reports saying Shreyas Iyer to Skip IPL For World Cup after BCCI Excluded him from Central Contract
  • వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అయ్యర్ నిర్ణయించుకున్నట్టుగా వెలువడుతున్న రిపోర్టులు
  • రంజీ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొన్న ‘రెవ్‌స్టోర్ట్స్’ రిపోర్ట్
  • ప్రస్తుతం ఒక్కో సెషన్‌లో 200 బంతులు ఆడుతున్నానని వెల్లడి
ఇటీవల తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బీసీసీఐ పెద్దలను శాంతింపజేయాలని స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ నిర్ణయింకున్నాడా?. ఇందుకు ప్రత్యమ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడా? అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు.  టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌కు దూరమవ్వాలని అయ్యర్ నిర్ణయించుకునట్టు ‘రెవ్‌స్పోర్ట్స్’ రిపోర్ట్ పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ శస్త్రచికిత్స తర్వాత నొప్పి నివారణ కోసం మూడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకున్నాడని తెలిపింది. రంజీ సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల సమయంలో నొప్పి తిరిగి బాధ పెట్టినా అందుబాటులోనే ఉంటాడని అయ్యర్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచ కప్ తర్వాత విరామం దక్కని ఏకైక ఆటగాడు అయ్యర్ అని సదరు వ్యక్తి చెప్పినట్టు ప్రస్తావించింది. ‘‘వన్డే వరల్డ్ కప్ తర్వాత  ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20I సిరీస్‌, ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులు ఆడాడు. ఒక ఆటగాడికి అతడికి నచ్చిన కోచ్‌తో శిక్షణ పొందే స్వేచ్ఛ లేదా?’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నట్టు ‘రెవ్‌స్పోర్ట్స్’ రిపోర్ట్ తెలిపింది.

క్రమంగా పని భారాన్ని పెంచుకోవడం కోసం అయ్యర్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ అకాడమీకి వెళ్లాడని సన్నిహిత వ్యక్తి పేర్కొన్నట్టుగా రిపోర్ట్ వెల్లడించింది. ‘‘ఒక సెషన్‌లో 60 బంతులు ఆడిన తర్వాత అయ్యర్ నొప్పికి గురయ్యాడు. కాస్త ఇబ్బంది పడిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం సెషన్‌కు 200 బంతులు ఆడుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై జట్టు ప్రధాన కోచ్ ఓంకార్ సాల్వి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయ్యర్ పురోగతిని తెలుసుకునేందుకు ఓంకార్ సాల్వి చాలాసార్లు ‘కోల్‌కతా నైట్ రైడర్స్ అకాడమీని సందర్శించారు’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నట్టుగా  రిపోర్ట్ వెల్లడించింది. కాగా ఐపీఎల్ కారణంగా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
Shreyas IyerShreyas Iyer
IPL
BCCI
Cricket
Team India

More Telugu News