IAF Plane: హైదరాబాదులో వాయుసేన విమానానికి తప్పిన ప్రమాదం

  • వాయుసేన శిక్షణ విమానంలో సాంకేతికలోపం
  • తెరుచుకోని హైడ్రాలిక్ వింగ్స్
  • 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
  • ఎట్టకేలకు బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • విమానంలోని మొత్తం 12 మందీ సురక్షితం
IAF Training Plane makes emergency landing in Begumpet airport

భారత వాయుసేనకు చెందిన విమానాలు కొన్ని దశాబ్దాలుగా ప్రమాదాలకు గురికావడం తెలిసిందే. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇవాళ హైదరాబాదులో వాయుసేనకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన శిక్షణ విమానం కిందికి దిగే సమయంలో హైడ్రాలిక్ వింగ్స్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానం 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. 

చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో పైలెట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా ఉండడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News