Hyderabad: హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్‌

Hemanth Keshav Patil as Hyderabad additional collector
  • హైదరాబాద్ స్పెషల్ ఎస్పీఎంగా డిప్యూటీ కలెక్టర్ కే.జ్యోతికి పోస్టింగ్
  • కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన స్నేహ శబరీశ్ 
  • జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా భోర్కడే హేమంత్ సహదేవ్ రామ్ నియామకం
హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ స్పెషల్ ఎస్పీఎంగా డిప్యూటీ కలెక్టర్ కే.జ్యోతికి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పని చేస్తోన్న కొమరయ్యను జనగామ ఆర్డీవోగా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్ బదిలీ అయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆమెను కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అక్కడి కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవ్ రామ్‌ను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమించారు.
Hyderabad
Telangana

More Telugu News