Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 195 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.81 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 72,500కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,983 వద్ద స్థిరపడింది. హెల్త్ కేర్ మినహా మిగిలిన అన్ని సూచీలు ఈరోజు లాభపడ్డాయి. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ మారకం విలువ రూ. 82.91గా ఉంది.   

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.73%), ఏసియన్ పెయింట్స్ (1.13%), నెస్లే ఇండియా (1.12%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.07%). 

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-0.73%), టీసీఎస్ (-0.59%), భారతి ఎయిర్ టెల్ (-0.57%), ఐటీసీ (-0.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.42%).

More Telugu News