Revanth Reddy: కాసేపట్లో కేరళకు బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy going to Kerala
  • సమరాగ్ని యాత్రను చేపట్టిన కేసీ వేణుగోపాల్
  • తిరువనంతపురంలో ఈరోజు ముగింపు సభ
  • ముగింపు సభకు హాజరవుతున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేరళకు వెళ్తున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు రేవంత్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కేరళకు వెళ్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ఇన్ఛార్జీగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. రాత్రికి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం యాత్ర సమరాగ్నిని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ యాత్ర ముగింపు సభకు రేవంత్ హాజరవుతున్నారు. 

Revanth Reddy
Congress
Kerala

More Telugu News