Cassandra Mae Spittmann: జర్మనీ గాయని భక్తి గీతానికి దరువేసిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!

  • హైందవ భక్తిగీతాలతో అలరిస్తున్న జర్మనీ గాయని
  • గతంలో ఆమె గురించి మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించిన మోదీ
  • తమిళనాడులోని పల్లడంలో మోదీని కలిసిన కసాండ్రా మే స్పిట్ మాన్ 
PM Modi appreciates German singer Cassandra Mae Spittmann

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ శ్రీరాముడి భక్తిగీతం పాడడం, ఆ వీడియో గురించి ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లోనూ, సోషల్ మీడియాలోనూ స్పందించడం అందరికీ తెలిసిందే. ఆ జర్మనీ గాయని తన తల్లితో కలిసి భారత్ రాగా... వారిని ప్రధాని మోదీ కలుసుకున్నారు. 

తమిళనాడులోని పల్లడం వద్ద కసాండ్రా మే స్పిట్ మాన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆమె 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపించగా... మోదీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. అంతేకాదు, "వాహ్" అంటూ ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ గుర్తింపు పొందారు.

More Telugu News