నాన్నగారు ఇంటికి వస్తానన్నారు .. కానీ ఇక రాలేదు: ఘంటసాల కూతురు సుగుణ
- ఘంటసాలకి కోపం తెలియదన్న కూతురు
- ఆయన తరచూ తిరుపతి వెళ్లేవారని వెల్లడి
- నాటు మందు వలన ఇబ్బంది పడ్డారని వ్యాఖ్య
- రెండోసారి హార్ట్ ఎటాక్ తీసుకెళ్లిపోయిందంటూ కన్నీళ్లు
" మా నాన్నగారికి కోపం రావడం మేము చూడలేదు .. ఆయన గట్టిగా మాట్లాడం కూడా మాకు తెలియదు. ఏ మాత్రం తీరిక దొరికినా మమ్మల్ని తీసుకుని 'తిరుపతి' వెళ్లేవారు. స్వామివారికి ఎదురుగా ఉన్న వాకిలిలో కూర్చొని పాడేవారు. అది ఎంత గొప్ప విషయమనేది మాకు అప్పుడు తెలియదు. నాన్నగారికి చాలా చిన్నవయసులోనే షుగర్ వచ్చింది. ఒక నాటు వైద్యుడు ఇచ్చిన మండు వాడటం వలన, గొంతు కొట్టుకుపోయి చాలా బాధపడ్డారు.
హైదరాబాద్ లో రవీంద్రభారతిలో ఏదో కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. గొంతు కొట్టుకుపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు రెండోసారి వచ్చింది. గొంతు బాధ నుంచి ఆయన కోలుకున్నారు. మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఇంటికి వచ్చాక అంతా కలిసి బీచ్ కి వెళదామని మాతో అన్నారు. కానీ కాసేపటిలో డిశార్జ్ అనగా ఆయనకి మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ రోజున స్కూల్ నుంచి మేము ఇంటికి వెళ్లిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేం" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.