Ghantasala: నాన్నగారు ఇంటికి వస్తానన్నారు .. కానీ ఇక రాలేదు: ఘంటసాల కూతురు సుగుణ

  • ఘంటసాలకి కోపం తెలియదన్న కూతురు 
  • ఆయన తరచూ తిరుపతి వెళ్లేవారని వెల్లడి 
  • నాటు మందు వలన ఇబ్బంది పడ్డారని వ్యాఖ్య 
  • రెండోసారి హార్ట్ ఎటాక్ తీసుకెళ్లిపోయిందంటూ కన్నీళ్లు

Ghantasala Suguna Interview

ఘంటసాల .. తెలుగు పాటను తేనెతో అభిషేకించిన గాయకుడు. ఎన్నో వేల పాటలు ఆయన స్వరం నుంచి జాలువారాయి. ఆయన రెండో కూతురు సుగుణ తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా ఇల్లు ఎప్పుడూ సినిమావాళ్లతో చాలా సందడిగా ఉండేది. పాటల రిహార్సల్స్ మా ఇంట్లోనే జరుగుతూ ఉండేది. రామారావుగారి ఫ్యామిలీకి ... మా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూ వేసేవారు" అని అన్నారు. 

" మా నాన్నగారికి కోపం రావడం మేము చూడలేదు .. ఆయన గట్టిగా మాట్లాడం కూడా మాకు తెలియదు. ఏ మాత్రం తీరిక దొరికినా మమ్మల్ని తీసుకుని 'తిరుపతి' వెళ్లేవారు. స్వామివారికి ఎదురుగా ఉన్న వాకిలిలో కూర్చొని పాడేవారు. అది ఎంత గొప్ప విషయమనేది మాకు అప్పుడు తెలియదు. నాన్నగారికి చాలా చిన్నవయసులోనే షుగర్ వచ్చింది. ఒక నాటు వైద్యుడు ఇచ్చిన మండు వాడటం వలన, గొంతు కొట్టుకుపోయి చాలా బాధపడ్డారు. 

హైదరాబాద్ లో రవీంద్రభారతిలో ఏదో కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. గొంతు కొట్టుకుపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు రెండోసారి వచ్చింది. గొంతు బాధ నుంచి ఆయన కోలుకున్నారు. మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఇంటికి వచ్చాక అంతా కలిసి బీచ్ కి వెళదామని మాతో అన్నారు. కానీ కాసేపటిలో డిశార్జ్ అనగా ఆయనకి మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ రోజున స్కూల్ నుంచి మేము ఇంటికి వెళ్లిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేం" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

More Telugu News