Garbhini-GA2: గర్భస్థ పిండం కచ్చితమైన వయసు తెలుసుకునేందుకు ఏఐ మోడల్

  • టీహెచ్ఎస్‌టీఐతో కలిసి అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్
  • గర్భిణి-జీఏ2గా నామకరణం
  • మతాశిశు మరణాలకు అడ్డుకట్ట
IIT Madras researchers develop AI model to determine the age of a foetus with THSTI

గర్భస్థ పిండం కచ్చితమైన వయసును నిర్ధారించేందుకు ఫరీదాబాద్‌కు చెందిన ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ)తో కలిసి ఐఐటీ మద్రాస్ కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను అభివృద్ది చేసింది. గర్భిణుల విషయంలో మరింత సంరక్షణ తీసుకునేందుకు, వారి డెలివరీ డేట్‌ను కచ్చితంగా నిర్ధారించేందుకు గర్భధారణ వయసు (జీఏ) తెలుసుకోవడం చాలా అవసరం. 

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను ‘గర్భిణి-జీఏ2’గా వ్యవహరిస్తున్నారు. భారతీయ మహిళల కోసం ఉద్దేశించి దీనిని ఆవిష్కరించారు. గర్భిణుల విషయంలో ప్రసూతి వైద్యులు, నియోనాటలజిస్టులు (నవజాత శిశువుల నిపుణులు) తీసుకొనే సంరక్షణ చర్యలను ఈ కొత్త మోడల్ మరింత మెరుగుపరుస్తుందని, దేశంలో మాతాశిశు మరణాలను అడ్డుకుంటుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.

More Telugu News