Siddipet District: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో ఇదిగో

  • సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రాజీవ్ హైవేపై ప్రమాదం
  • వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు
  • తొలుత డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ఎగిరిపడ్డ వైనం
  • ఘటనలో గాయపడ్డ నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమం 
Siddipet shocking road accident 4 injured 2 critical

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ హైవేపై వేగంగా వెళుతూ అదుపు కోల్పోయిన ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఘటన తాలూకు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్ వైపు వస్తున్న కారు తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News