Priyanka Gandhi: ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

  • రెండు గ్యారెంటీలను ప్రియాంక చేతుల మీదుగా అమలు చేయాలని భావించిన తెలంగాణ కాంగ్రెస్
  • ఈ నెల 27న ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు చేసిన కాంగ్రెస్
  • వర్చువల్‌గా గ్యారెంటీలను ప్రారంభించనున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi telangana tour canceled

ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభ వేదికగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని కాంగ్రెస్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కానీ అనివార్య కారణాలతో రేపటి ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్‌గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు గ్యారంటీలను పాక్షికంగా అమలు చేశారు. రేపు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నారు.

More Telugu News